‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటికి ప్రొమోషన్స్ .

Published on Dec 13, 2019 9:10 am IST

విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్ షురూ చేశారు. దీనిలో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తో ఉన్న ఓ రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్ కొత్తగా పెళ్లైన యంగ్ కపుల్ లా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన తరువాత ఐశ్వర్య రాజేష్ ఓ భిన్నమైన రోల్ చేస్తుందనిపిస్తుంది.ఇవాళ సాయంత్రం మరో హీరోయిన్ ఇజబెల్లా లైట్ మరియు విజయ్ ల పోస్టర్ విడుదల చేయనున్నారు. రేపు క్యాథెరిన్ థెరిస్సా, చివరిగా ఈనెల 15న వరల్డ్ ఫేమస్ లవర్ మెయిన్ హీరోయిన్ రాశి ఖన్నాతో విజయ్ ఉన్న పోస్టర్స్ విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్ ఉన్న నేపథ్యంలో వారితో విజయ్ ఉన్న పోస్టర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేయడం ద్వారా ప్రొమోషన్స్ షురూ చేశారు. తన చిత్రాల విషయంలో విజయ్ చేస్తున్న ప్రమోషన్స్ వినూత్నంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. డియర్ కామ్రేడ్ విషయంలో కూడా విజయ్ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆ మూవీకి మంచి హైప్ తీసుకొచ్చారు. దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :