బాలీవుడ్లో స్ట్రైట్ సినిమాతో విజయ్..అది కూడా సాలిడ్ స్క్రిప్ట్!

Published on Sep 24, 2020 10:00 am IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నిలదొక్కుకున్న కొద్ది లోనే మంచి స్టార్డం ను సంపాదించుకున్నాడు. కేవలం మన టాలీవుడ్ వర్గాలను మాత్రమే కాకుండా ఇతర సినీ వర్గాల ప్రేక్షకులను అలరించిన విజయ్ ఇపుడు మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ను చేస్తూ పాన్ ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసాడు.

అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం విజయ్ దేవరకొండ స్ట్రైట్ గా ఒక బాలీవుడ్ లో అందులోను ఒక సాలిడ్ స్రిప్ట్ కు సైన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. గత ఏడాది పుల్వామా దాడులలో పాక్ సైన్యానికి దొరికిన మన దేశపు వింగ్ కమాండర్ అభినందన్ జీవిత చరిత్రపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. విజయ్ ఈ చిత్రంలో అభినందన్ రోల్ ను చేయనుండగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారని టాక్. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More