ఇంటర్వ్యూ : విజయ్ దేవరకొండ – నోటా చాలా రియాలిస్టిక్ పొలిటికల్ డ్రామా !

Published on Oct 4, 2018 4:15 pm IST

గీత గోవిందం తో 100కోట్ల హీరోగా మారిన విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ద్విభాషా చిత్రం నోటా. ఈచిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా చిత్రం హీరో విజయ్ మీడియాతో మాట్లాడారు . ఆవిశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రమోషన్స్ తో బిజీ అయిపోయినట్లున్నారు ?

మొన్ననే గీత గోవిందం సినిమాకు ప్రమోషన్స్ చేశా దాని తరువాత ఇప్పుడు నోటా కు చేస్తున్న చాలా టైడ్ అయిపోయాను. రేపు ఒక్క రోజు తో ఈ ప్రమోషన్స్ స్వస్తి చెబుతా.

ఇంత బిజీ అవ్వాలని అనుకున్నారా ?

బిజీ అంటే సినిమాలు చేయాలి అనుకున్నాను. కానీ ఇలా నిద్ర లేని రాత్రులు గడుపుతాను అనుకోలేదు. ఒక్క రోజులో 8లేదా 9 వీడియో ప్రమోషన్స్ చేస్తున్నా.

కాంట్రవర్సి ల గురించి ?

అదే నాకు అర్ధం అవ్వట్లేదు. నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్.

సినిమాల లీకుల గురించి ?

గీత గోవిందం విడుదలకు రెండు రోజులు ముందు సినిమా అంత లీక్ అయింది. మళ్ళీ ఇప్పుడు టాక్సీవాల చిత్రం కూడా లీక్ అయింది. దాదాపు సంవత్సరంన్నర ఈచిత్రాలకు నా సమయాన్ని కేటాయించాను. ఇలా లీక్ అయితే పరిస్థితి ఏంటో అర్ధం కాలేదు.

నోటా గురించి ?

చాలా రియాలిస్టిక్ పొలిటికల్ మూవీ. చాలా సన్నివేశాలు రియల్ గా అనిపిస్తాయి. ఆసక్తికరంగా వుండి తమిళ రాజకీయాలకు దగ్గరగా ఉంటుంది. నాకు బేసిక్ పొలిటికల్ నాలెడ్జ్ వుంది. అందుకే ఈ పొలిటికల్ స్టోరీ ను ఎంచుకున్నా. లవ్ స్టోరీ ఎప్పుడైనా చెయ్యొచ్చు కానీ ఇలాంటి పొలిటికల్ స్టోరీ దొరుకుంతుందో లేదో అని ఇంకా కొత్తగా చేద్దాం అని చేశాను.

ఇటీవల మీరు ఒక ఫారెన్ అమ్మాయితో కలిసి దిగిన ఫొటో లీక్ అయింది దాని గురించి ?

ఆ ఫోటో లో వున్నది నేనే . అది మార్ఫింగ్ చేశారు అందులో వుంది నేను కాదు అని చెప్పను. ఆ ఫోటో రెండు సంవత్సరాల క్రితంది . ఆ అమ్మాయి చాలా మంచిది. మీరు ఈ విషయాన్ని తొందరగా మర్చిపోవాలని అనుకుంటుంన్నాను.

మీ తదుపరి చిత్రాల గురించి ?

క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న అలాగే ఇంకో ద్విభాషా చిత్రం కూడా చేయాల్సివుంది. కానీ రేపు ఈసినిమా విడుదలైన తరువాత నిర్ణయం తీసుకుంటా.

సంబంధిత సమాచారం :