విడుదల తేదీని ఖారారు చేసుకున్న ‘టాక్సీవాలా’ !

Published on Oct 20, 2018 3:57 pm IST

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోయే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’ చిత్రం. అయితే, ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కారణంగా విడుదలతేదీ వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా విడుదల తేదీని ఖారారు చేసుకుంది. నవంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవ్వబోతుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

కాగా ఇటీవలే ‘నోటా’ చిత్రం రూపంలో ప్లాప్ ని ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ.. ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ఎప్పుడొచ్చినా హిట్ అవుతుందని విజయ్ గతంలోనే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం విజయ్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేస్తుందమో చూడాలి.

ఇక మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం వి.ఎఫ్.ఎక్స్ పనుల కారణంగా విడుదల ఆలస్యం అయి.. నవంబర్ 16న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :