పట్టు వదలని విజయ్ దేవరకొండ

Published on Jun 14, 2019 3:08 pm IST

యువ హీరో విజయ్ దేవరకొండ భవిష్యత్తును చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ యువ హీరో చేయని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగునాట ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో స్టార్ అయిన విజయ్ కేవలం తెలుగుకే పరిమితం కాకుండా సౌత్ ఇండియన్ హీరోగా ఎదగాలని అనుకుంటున్నాడు. అందుకే తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో కూడా నిలదొక్కుకోవాలని ట్రై చేసున్నారు.

దీనికోసం బైలింగ్వల్, మల్టీలింగ్వల్ సినిమాలకు ఓకే చెప్తూ తమిళ దర్శకులకి అవకాశాలిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మొదట తమిళ డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘నోటా’ అనే ద్విభాషా చిత్రాన్ని చేశాడు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ‘హీరో’ సినిమాతో రెండో ప్రయత్నం చేస్తున్నారు. ఈ బైలింగ్వల్ సినిమాను కూడా ఆనంద్ అన్నామలై అనే తమిళ దర్శకుడే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుని తమిళంలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనేది విజయ్ ప్లాన్. ఇదే ప్లాన్‌ను మలయాళం, కన్నడ పరిశ్రమల్లో కూడా అప్లై చేస్తున్నాడు. అందులో మొదటి ప్రయత్నంగా తన తర్వాతి చిత్రం ‘డియర్ కామ్రేడ్’ను నాలుగు భాషల్లోనూ విడుదలచేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More