తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ !

Published on Feb 19, 2019 12:16 pm IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ,’మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్ గా అలాగే మరోవైపు 8 సంవత్సరాల అబ్బాయికి తండ్రి గా కనిపించనున్నాడు. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కాథరిన్ , ఇజబెల్లి కథానాయిలుగా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేసింది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

ఇక విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :