నిర్మాతకు బ్యూటిఫుల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ

Published on Jan 28, 2021 7:09 pm IST

విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు తన అభిమాన వ్యక్తులకు బహుమతులు పంపుతుంటారు. ఆ బహుమతులలో ఎక్కువగా దుస్తులే ఉంటాయి. టాలీవుడ్లో స్టైలింగ్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండే అల్లు అర్జున్ లాంటి స్టార్లకు విజయ్ తన సొంత బ్రాండ్ దుస్తులను బహుమతిగా అందించారు. ఇప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కు కూడ విజయ్ అలాంటి బహుమతి ఇచ్చారు. కరణ్ కోసం ప్రత్యేకంగా డెనిమ్ జాకెట్ ఒకదాన్ని డిజైన్ చేయించి పంపించారు.

ఆ జాకెట్ కరణ్ జోహార్ మనసు దోచుకుంది. దాన్ని సోషల్ మీడియాలో అందరికీ చూపిస్తూ చాలా బాగుందని విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు చెప్పారు. బాలీవుడ్లో కరణ్ జోహార్ స్టైల్ ఐకాన్ లాంటి వ్యక్తి. ప్రపంచస్థాయి స్టైలింగ్ ఫాలో అవుతుంటారు ఆయన. ఇంటర్నేషనల్ బ్రాండ్లను, కస్టమైజ్డ్ దుస్తులనే వాడుతుంటారు. అలాంటి వ్యక్తిని మెప్పించేలా విజయ్ గిఫ్ట్ పంపాడు. ఇకపోతే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’కు నిర్మాత కరణ్ జోహారే.

సంబంధిత సమాచారం :