సర్కార్ టీజర్ కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్ !

Published on Oct 19, 2018 9:17 am IST

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన 62వ చిత్రం ‘సర్కార్’ టీజర్ మరి కొద్దీ గంటల్లో విడుదల కానుంది. ఈ టీజర్ ఫై ఆయన అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక ఈ టీజర్ ఈరోజు సాయంత్రం6గంటలకు విడుదలకానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న రెండు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో విడుదలకానుంది.

కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈచిత్రానికి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక ‘తుపాకీ , కత్తి’ చిత్రాల తరువాత విజయ్ -మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ మూడవ చిత్రంపై తమిళ్ తోపాటు తెలుగులోను భారీ అంచనాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :