దీపావళికే వస్తానంటున్న స్టార్ హీరో !

దీపావళికే వస్తానంటున్న స్టార్ హీరో !

Published on Mar 1, 2019 6:30 PM IST

vijay

మెర్సల్ , సర్కార్ తో బ్యాక్ తో బ్యాక్ హిట్లు కొట్టాడు తమిళ స్టార్ హీరో విజయ్. ఈ రెండు చిత్రాలు కూడా దీపావళికే విడుదలయ్యాయి. ఇక తాజాగా హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమయ్యాడు ఈ హీరో. ప్రస్తుతం విజయ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన 63 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం కూడా దీపావళికే విడుదలకానుందని చిత్ర నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక తెరి, మెర్సల్ తరువాత విజయ్ -అట్లీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు