పెట్టా షూటింగ్ ను పూర్తి చేసిన స్టార్ హీరో!

Published on Oct 3, 2018 9:04 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వారణాసి లో శరవేగంగా జరుగుతుంది. ఈచిత్రం లో ముఖ్య పాత్రనుపోషిస్తున్న స్టార్ హీరో విజయ్ సేతుపతి తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశారు.

ఇక రజినీ కూడా వీలైనంత తొందరగా ఈచితాన్ని పూర్తి చేసి పాలిటిక్స్ లో బిజీ అవ్వాలని బావిస్తున్నాడట. దాంట్లో భాగంగా వచ్చే నెలలో ఈచిత్రాన్ని పూర్తి చేసి సంక్రాంతి కి విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారట. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో సిమ్రాన్, త్రిష , బాబీ సింహాలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకం ఫై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :