“విక్రమార్కుడు” గా తెలుగులోకి వస్తున్న విజయ్ సేతుపతి మూవీ!

Published on Jul 5, 2021 5:34 pm IST

తమిళ నాట సూపర్ హిట్ విజయం సాధించిన విజయ్ సేతుపతి జుంగా చిత్రం తెలుగు లో డబ్ అయి విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. తెలుగు నాట సెన్సేషన్ సృష్టిస్తున్న ఆహా ఓటిటి యాప్ ద్వారా ఈ చిత్రం తెలుగు లో విడుదల కానుంది. జుంగా చిత్రాన్ని తెలుగు లో విక్రమార్కుడు గా తీసుకు వస్తున్నారు. క్యాప్షన్ రియల్ డాన్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం జూలై 9 వ తేదీ నుండి ఆహా లో స్ట్రీమ్ కానుంది.

అయితే ఆహా యాప్ ఎన్నో చట్టాలను తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి సూపర్ హిట్ చిత్రాల నుండి కొత్త నేటి చిత్రాలను కూడా తీసుకు వస్తుంది. కొన్ని కొత్త సినిమాలను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ సేతుపతి చిత్రం తో పాటుగా పునర్ణవి భూపాలం నటించిన ఒక చిన్న విరామం కూడా జూలై 9 వ తేదీ నుండి ఆహా లో స్ట్రీమ్ కానుంది.

సంబంధిత సమాచారం :