కృతిశెట్టితో ఎప్పటికీ జోడీ కట్టలేను – విజయ్ సేతుపతి

Published on Sep 7, 2021 2:21 am IST


తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సేతుపతి మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిశెట్టికి విజయ్ సేతుపతి తండ్రిగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతి తమిళంలో ఓ ప్రాజెక్టు చేశారు. అందులో హీరోయిన్‌గా మొదట కృతిశెట్టిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందట.

అయితే దీనికి విజయ్ సేతుపతి నో చెప్పినట్టు ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి నేను తండ్రిగా నటించానని, ఆ సినిమా క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడిందని, అప్పుడు ఆమెకు నా కూతురు లాంటి దానివి అని చెప్పి భయపడకుండా చేయమని ధైర్యం చెప్పానని, కూతురిలా భావించినా కృతిశెట్టితో జోడీ కట్టడం తనకు ఇష్టం లేదని చెప్పానని అన్నారు. అంతేకాదు భవిష్యత్తులోనూ కృతిశెట్టితో జోడీగా చేయనని విజయ్ సేతుపతి తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘లాభం’ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుద‌ల కాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలవుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది.

సంబంధిత సమాచారం :