మెగా హీరో సినిమాలో హీరోయిన్ తండ్రిగా తమిళ్ హీరో.

Published on Jun 13, 2019 11:06 am IST

విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి కి తమిళ పరిశ్రమలో మంచి పేరుంది. ఆయన తమిళంలో హీరో గా వరుసగా సినిమాలు చేస్తూనే తెలుగులో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ‘సైరా’ మూవీలో పోరాట వీరుడిగా ఆయన ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో మెగా హీరో మూవీ లో కూడా విజయ్ ఓ ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “ఉప్పెన”.

ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న కృతి శెట్టికి తండ్రిగా విజయ్ సేతుపతి కనిపించనున్నారని సమాచారం. మూవీలో ఆ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో పాటు కథలో కీలకం కావడంతో విజయ్ సేతుపతి అంగీకారం తెలిపారట. అలాగే ఇందులో ఆయనే విలన్ అనికూడా తెలుస్తుంది. ‘ఉప్పెన’ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా,దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More