ఆకట్టుకుంటోన్న విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’ ఫస్ట్ లుక్ టీజర్

ఆకట్టుకుంటోన్న విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’ ఫస్ట్ లుక్ టీజర్

Published on Aug 2, 2022 11:30 PM IST

భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అనేక భాషల్లో కొన్నాళ్లుగా బయోపిక్స్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా సామాన్యుడిగా జీవితాన్ని ఆరంభించి ఒక పెద్ద లాజిస్టిక్స్ కంపెనీ అధినేతగా ఎంతో కష్టపడి ఎదిగి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన డాక్టర్ ఆనంద్ శంకేశ్వర్ జీవితం ఆధారంగా ప్రస్తుతం తెరకెక్కిన బయోపిక్ మూవీ విజయానంద్. భారీ పాన్ ఇండియా ఈ మూవీగా తెరకెక్కిన దీనిని దేశంలో అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒక‌టైన వీఆర్ఎల్‌కు సంబంధించిన వీఆర్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తొలిసారిగా వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పేరుతో సినీ రంగంలోకి అడుగు పెడుతూ నిర్మించారు.త్వరలో ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

ఆనంద్ శంకేశ్వ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో వి.ఆర్‌.ఎల్ ఫిల్మ్‌ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రిషికా శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ శంకేశ్వ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు గ్రాండ్ గా రిలీజ్ చేసారు. విజయానంద్ తన జీవితంలో తండ్రి యొక్క సపోర్ట్ తీసుకోకుండా స్వంత తెలివితేటలతో లారీల వ్యాపారం పెట్టి ఏ విధంగా ఒక్కో మెట్టు ఎక్కి ఫ్రైగేదిగారు, అలానే ఈ క్రమంలో ఆయన ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనే పలు ఇంట్రెస్టింగ్ అంశాలు టీజర్ లో చూపించారు. కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే నానుడిని నిజం చేసిన విజయ్ శంకేశ్వర్ జీవితం ఈ సినిమాగా రూపొందడంతో తప్పకుండా ఇది ఎందరికో స్పూర్ణిస్తుంది అనే చెప్పవచ్చు.

గతంలో ట్రంక్ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించిన రిషికా శర్మ ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తెరకెక్కించినట్లు చెప్తోంది యూనిట్. కాగా ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటించగా అనంత్ నాగ్, వినయ్ ప్రసాద్, వి రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర కీలక పాత్రలు చేయడం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు అద్భుతమైన సంగీతం, నేపధ్య సంగీతం అందించిన ఈ మూవీకి ఎడిట‌ర్‌గా హేమంత్ కుమార్ డి, మేక‌ప్ అండ్ హెయిర్ స్టైలిష్ట్ బాధ్య‌త‌ల‌ను ప్రకాష్ గోఖ‌క్ నిర్వ‌హిస్తుండగా, ఇమ్రాన్ స‌ర్దారియా కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు