మెగాహీరో లాంచింగ్ మూవీ రీమేక్ విజయ్ కొడుకుతో..?

మెగాహీరో లాంచింగ్ మూవీ రీమేక్ విజయ్ కొడుకుతో..?

Published on Apr 24, 2020 2:00 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వంతో పాటు, సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించడం జరిగింది. కాగా హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ని హీరోగా లాంచ్ చేసే యోచనలో ఉన్నారట అది కూడా ప్రొడక్షన్ దశలో ఉన్న ఉప్పెన మూవీ రీమేక్ ద్వారా లాంచ్ చేయాలని చూస్తున్నారట.

విషయంలోకి వెళితే విజయ్ సేతుపతి ఉప్పెన తమిళ రీమేక్ హక్కులు దక్కించుకున్నారట. ఓ ప్రేమ కథతో తన కొడుకు జేసన్ సంజయ్ ని హీరోగా పరిచయం చేయాలని చూస్తున్న విజయ్‌కు ఉప్పెన కథ వినిపించడంతో ఆయన ఆసక్తి కనబరిచారట.

జేసన్ సంజయ్ విదేశాల నుంచి తిరిగి రాగానే మరోసారి చర్చించి దాదాపు సినిమాకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్న సంజయ్ అది పూర్తవగానే ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి. ఇక ఉప్పెన మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు