ఈ హిట్ పడితే విజయ్ సౌత్ ఇండియా స్టార్ అవడం ఖాయం.

Published on Jul 24, 2019 2:56 pm IST

విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” ఈనెల 26 విడుదల కానున్న నేపథ్యంలో నేడు వైజాగ్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఇంకొద్ది గంటల్లో ఈ ఈవెంట్ గ్రాండ్ గా మొదలు కానుంది. ఐతే సౌత్ ఇండియా లో గల అన్ని ప్రధాన భాషల్లో విడుదలవుతున్న డియర్ కామ్రేడ్ చిత్ర మ్యూజిక్ ఈవెంట్స్ అన్ని ప్రధాన నగరాలలో నిర్వహించి విజయ్ తనదైన రీతిలో ప్రచారం కల్పించాడు. పొరుగు రాష్ట్రాలలో కూడా ఈ ఈవెంట్స్ కి విశేష ఆదరణ లభించడం కొసమెరుపు.

విజయ్ నటించిన “డియర్ కామ్రేడ్” కనుక విజయ్ సాధిస్తే సౌత్ వైడ్ గా పాపులారిటీ కావడం ఖాయం. విజయ్ ఊపు చూస్తుంటే ఆ ఘనత దక్కిచుకునేలా ఉన్నాడు. ఏమైనా విజయ్ దేవరకొండ హీరోగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్న విధానానికి మెచ్చుకోవాల్సిందే. భరత్ కమ్మ దర్శకత్వంలో వహించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రష్మిక మందనా విజయ్ సరసన నటిస్తుంది.

సంబంధిత సమాచారం :