హీరోయిన్లను గౌరవించండి – విజయశాంతి

హీరోయిన్లను గౌరవించండి – విజయశాంతి

Published on Apr 23, 2025 12:02 AM IST

Vijayashanthi 6
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమాలో నటించారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో ఆమె కనిపించారు. ఇక ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ క్రమంలో విజయశాంతి తాజాగా మీడియాతో ముచ్చటించారు.

తాను సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను చూస్తూ ఉన్నానని తెలిపారు. అయితే, సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ఆమె ఫాలో అవుతానని తెలిపారు. అయితే, టాలీవుడ్‌లో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారిని ‘నువ్వు’ అని సంబోధించడం తనకు నచ్చలేదని.. మహిళలకు గౌరవం ఇస్తూ హీరోయిన్లను ‘మీరు’ అని సంబోధిస్తే బాగుంటుంది అని విజయశాంతి తెలిపారు.

హీరోలను ‘మీరు’ అని పిలిచినప్పుడు.. హీరోయిన్లను కూడా ‘మీరు’ అనే పిలవాల్సిందిగా ఆమె మీడియాను కోరారు. ప్రస్తుతం విజయశాంతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు