విజయ్ దేవరకొండలో ఈ యాంగిల్ కూడా ఉందా…?

విజయ్ దేవరకొండలో ఈ యాంగిల్ కూడా ఉందా…?

Published on Jul 8, 2019 7:29 AM IST

vijay2

శివాత్మిక, ఆనంద్ దేవకొండ హీరో హీరోయిన్లుగా నటించిన ‘దొరసాని’ మూవీ జూలై 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, రాజశేఖర్ లు ముఖ్య అతిధులుగా హాజరుకాగా జీవిత తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు దేవరకొండ.

దొరసాని సినిమా పూర్తి చేసి ప్రమోషన్స్‌కి వచ్చినప్పుడు పూజా కార్యక్రమాలకు రావాలని ఉన్నా రాలేదని, టీజర్ షేర్ చేయాలని అనుకున్నా కాని ఆపుకున్నానని ఈ సినిమాలో నాకు చాలా పాటలు ఇష్టం షేర్ చేద్దాం అనుకున్నా కాని ఆపుకున్నానని ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా నిలదొక్కుకోవాలో.. తనను తాను ఎలా నిరూపించుకోవాలో తెలుసుకుంటాడని ఈ సినిమాను ఇప్పటి వరకూ పట్టించుకోలేదంటూ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. యూఎస్‌కి వెళ్లి జాబ్ చేస్తూ ఇంటికి డబ్బు పంపించి హెల్ప్ చేశావని, తాను స్ట్రగుల్ అవుతున్న టైంలో హెల్ప్ చేశావు కాని నీ సినిమాకి నేం ఏం చేయలేకపోయానని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ.

ఎప్పుడూ వివిధ సినిమా ఫంక్షన్లలలో తన ఫ్యాన్స్‌ కి ఉత్సాహం ఇస్తూ తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు చెప్పే విజయ్ దేవరకొండ తమ్ముడ్ని తలచుకుని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుని తనలోని కొత్త కోణాన్ని చూపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు