“జ్ఞాపిక మ్యూజిక్” ను ప్రారంభించిన విజయేంద్ర ప్రసాద్

“జ్ఞాపిక మ్యూజిక్” ను ప్రారంభించిన విజయేంద్ర ప్రసాద్

Published on Jul 6, 2021 1:28 AM IST

నిర్మాణ సంస్థ గా మంచి గుర్తింపు ఉన్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రస్తుతం మ్యూజిక్ రంగం లోకి అడుగు పెట్టింది. గుణ369 చిత్రం తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, వావ్, అలీతో సరదాగా, అలీతో జాలిగా, మా మహాలక్ష్మి లాంటి కార్యక్రమాల తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అయితే జ్ఞాపిక మ్యూజిక్ అనే టైటిల్ తో ఆడియో రంగం లోకి తాజాగా అడుగు పెట్టింది. ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ లోగోను, యూ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సంగీతానికి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా ప్రభావం తో అన్ని రకాలైన సాంకేతిక నిపుణులకు తమ సత్తా నిరూపించుకునే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సమయం లో మార్కెట్ లోకి వస్తున్న జ్ఞాపిక మ్యూజిక్ మంచి విజయాలు సాధించి సినిమా వారికి అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. అయితే జ్ఞాపిక ఎంటర్ టైన్మెంట్స్ అధినేత ప్రవీణ కడియాల మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే కరోనా వైరస్ సమయం లో కూడా మా జ్ఞాపిక మ్యూజిక్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలి అని అడగగానే ఆనందం గా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన విజయేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే జ్ఞాపక మ్యూజిక్ లో సినిమా ఆడియో లతో పాటుగా ప్రైవేట్ సాంగ్స్, భక్తి గీతాలు, వీడియో సాంగ్స్ ను మార్కెట్ లోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా నూతన టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం కోసమే మ్యూజిక్ రంగం లోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు