దర్శకుడ్ని సెలెక్ట్ చేసుకున్న విజయ్ !

Published on May 14, 2019 1:51 pm IST

స్టార్ హీరో విజయ్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడితో చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన కొంతమంది యువ దర్శకుల్ని కలిసి కథలు విన్నారట. వాటిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమా చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ చిత్రం ఈ ఏడాది రెండవ సగంలో మొదలుకానుంది. 50 రోజుల పాటు మాత్రమే షూట్ జరుగుతుందని, 2020 ఏప్రిల్ లేదా మే నెలలో చిత్రాన్ని విడుదలచేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్ గతంలో ‘మానగరం, అవియల్, ఖైతి’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు, నటీనటులెవరు, కథ ఎలా ఉండబోతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More