ఓటిటి సమీక్ష: “వికటకవి” – తెలుగు వెబ్ సిరీస్ జీ5 లో

ఓటిటి సమీక్ష: “వికటకవి” – తెలుగు వెబ్ సిరీస్ జీ5 లో

Published on Nov 29, 2024 3:03 AM IST
Vikkatakavi Web Series Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 28, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్.

దర్శకుడు : ప్రదీప్ మద్దాలి

నిర్మాత : రజని తాళ్లూరి

సంగీత దర్శకుడు : అజయ్ అరసాడా

సినిమాటోగ్రఫీ : షోయెబ్ సిద్దికీ

ఎడిటర్: సాయి బాబు తలారి

సంబంధిత లింక్స్: ట్రైలర్

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నరేష్ అగస్త్య అలాగే యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ ల కలయికలో లేటెస్ట్ గా వచ్చిన ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ నే “వికటకవి”. జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఇక కథ లోకి వస్తే.. ఈ సిరీస్ 1970ల దశకంలో సెట్ చేయబడింది. అప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో తెలివైన విద్యార్థి రామకృష్ణ(నరేష్ అగస్త్య) తన తెలివితేటలతో పలు సమస్యలని తేలిగ్గా పరిష్కరిస్తూ ఉండేవాడు. దీనితో తన ప్రొఫెసర్ ఒకరు అతనికి ఒక మిస్టీరియస్ ఛాలెంజ్ ని ఇస్తారు. ఒక ఊరిలో జనం ఆకస్మికంగా దేవతల గుట్ట అనే ప్రాంతానికి వెళ్ళినపుడు తన జ్ఞాపకాలను మర్చిపోతూ ఉంటారు. మరి వారు ఎందుకు ఇలా మర్చిపోతున్నారు. ఈ కేసు సాల్వ్ చేయడానికి వెళ్లిన రామకృష్ణ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఆ ఊరి సమస్యని తాను పరిష్కరించాడా లేదా? రామకృష్ణకి ఆ ఊరికి ఏమన్నా సంబంధం ఉందా? తన గతం ఏంటి అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో నరేష్ అగస్త్య కూడా ఒకడు. రీసెంట్ గానే కలి సినిమాలో తన వెర్సటాలిటీ చూపించాడు. తనకి ఈ తరహాలో ఇంట్రెస్టింగ్ పాత్రలు బాగా సూట్ అవుతాయి అని ఈ సిరీస్ చూస్తే ఇంకా అర్ధం అవుతుంది. తనలోని ఒక సెటిల్డ్ పెర్ఫామర్ ఈ సిరీస్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన మాట తీరు, ఒక డిటెక్టివ్ లా బాడీ లాంగ్వేజ్ లతో ఈ సిరీస్ లో తాను ఆకట్టుకుంటాడు.

ఇక ఈ సిరీస్ లో ఇతర నటీనటులు కూడా మంచి నటన కనబరిచారు. తారక్ పొన్నప్ప సాలిడ్ రోల్ ని చేయగా తనతో పాటుగా షిజు మీనన్, రఘు కుంచె తమ పాత్రల్లో షైన్ అయ్యారు. అలాగే రవితేజ నన్నిమల్ల ఇంకా అమిత్ తివారిలు ఆకట్టుకుంటారు.

ఇక ఈ సిరీస్ లో బ్రిలియెంట్ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా మంచి కుతూహలాన్ని అందించేలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అని చెప్పాలి. పెద్దగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా క్లీన్ గా కొనసాగించిన కథనం ఇంప్రెస్ చేస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ లో మూమెంట్స్ ఒకింత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ పలు సన్నివేశాలు ఇంకా బలంగా ప్రెజెంట్ చేయాల్సింది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగదీతగా అనిపిస్తుంది. ఇంకా పలు ఎలివేషన్స్ వంటి వాటిని ఇంకొంచెం బెటర్ గా తీసి ఉండాల్సింది.

అలాగే సిరీస్ లో మెగా ఆకాష్ రోల్ ఒకింత డిజప్పాయింట్ చేస్తుందని చెప్పాలి. తన పాత్రలో అంత డెప్త్ ఉన్నట్టు కనిపించదు. దీనితో సిరీస్ లో తన లాంటి నోటెడ్ ఫేస్ ఉన్నప్పటికీ ఆమె పాత్ర వేస్ట్ అయ్యినట్టుగా అనిపిస్తుంది.

అలాగే పలు చోట్ల కథనం మాత్రం ఒకింత సింపుల్ గా ఊహాజనితంగానే అనిపిస్తుంది. అలాగే ఈ సిరీస్ లో కొన్ని సాగదీత సన్నివేశాల కంటే మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లు లాంటివి పెట్టి ఉంటే మరింత గ్రిప్పింగ్ గా అనిపించి ఉండేది కానీ వాటిని మేకర్స్ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. మెయిన్ గా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా మేకర్స్ తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. అప్పటి సెటప్ అలాగే డ్రెస్సింగ్ వంటివి సిరీస్ లో అప్పటి కాలంతో లీనం అయ్యేలా చేస్తాయి. ఇంకా సంగీతం, ఛాయాగ్రాణం బాగున్నాయి. సిరీస్ టోన్ కి తగ్గట్టుగా సన్నివేశాలని ప్రతిబింబించేలా చేసాయి. కొన్ని స్లో సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది.

ఇక దర్శకుడు ప్రదీప్ మద్దాలి విషయానికి వస్తే.. ఈ సిరీస్ లో తాను థ్రిల్లర్ ఆడియెన్స్ కి డీసెంట్ ట్రీట్ ఇచ్చేలా తెరకెక్కించారని చెప్పొచ్చు. సిరీస్ లైన్ ని దాదాపు ఎగ్జైటింగ్ గా తెరకెక్కించేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది. అలాగే పలు సన్నివేశాలని ఇంకాస్త బెటర్ గా కానీ ప్రెజెంట్ చేసి ఉంటే తాను మరో మెట్టు ఎక్కి ఉండేవారని చెప్పాలి. అయినప్పటికీ ఒక సాలిడ్ డిటెక్టివ్ షోని చూడాలి అనుకునేవారికి తన వర్క్ ఇంప్రెస్ చేసేలా ఉంటుందని చెప్పాలి.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే తెలంగాణ నుంచి వచ్చిన మొదటి డిటెక్టివ్ సిరీస్ “వికటకవి” ఇంట్రెస్టింగ్ థీమ్ తో మంచి థ్రిల్స్ ఇచ్చే కథనం ఎపిసోడ్స్ తో డీసెంట్ గా సాగుతుంది అని చెప్పాలి. మెయిన్ లీడ్ లో నటుడు నరేష్ అగస్త్య మరోసారి షైన్ అవ్వగా ఈ సిరీస్ ఇంప్రెస్ చేస్తుంది. కాకపోతే ఇంకొంచెం బెటర్ గా కొన్ని సీన్స్ ని తెరకెక్కించి ఉంటే డెఫినెట్ గా ఇది మరింత థ్రిల్స్ అందించేది. అయినప్పటికీ ఈ సిరీస్ ని డెఫినెట్ గా ఓటిటిలో ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు