గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న విక్రమ్

Published on Jan 13, 2020 8:15 am IST

హీరో చియాన్ విక్రమ్ వరుసగా పెద్ద సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి మణిరత్నం చేస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమా మొదటి షెడ్యూల్ థాయిలాండ్ లొకేషన్లలో జరిగింది. ఇందులో ఇతర నటీనటులతో పాటు విక్రమ్ పాల్గొన్నారు. కష్టతరమైన ఈ షెడ్యూల్ ముగించిన తర్వాత టీమ్ మొత్తం విశ్రాంతి కోసం ఎవరి స్వస్థలాలకు పయనమయ్యారు.

కానీ విక్రమ్ మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఇంకో చిత్రం ‘కోబ్రా’ షూటింగ్ కలకత్తా బయలుదేరి వెళ్లారు. ఈ చిత్రాన్ని అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. వయకామ్, 7 స్క్రీన్ స్టుడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం 2020కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ చిత్రంలో విక్రమ్ సుమారు 25 భిన్నమైన వేషధారణల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :