‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ ,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా రానుందని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఫై ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం అలాగే అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించడంతో ఈ సినిమా ఆగిపోవడం దాదాపు ఖాయం అయ్యింది. ఇక దాంతో తాజాగా విక్రమ్ కుమార్ అదే కథను న్యాచురల్ స్టార్ నాని కి వినిపించాడట. నాని కి కూడా ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడని సమాచారం.
త్వరలోనే ఈ చిత్రం ఫై అధికారికంగా ప్రకటన వెలుబడే అవకాశాలు వున్నాయి. ఇక నాని ప్రస్తుతం గౌతమ్ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్ కుమార్ తో చేయబోయే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.


