హాలీవుడ్ ఆఫర్ వదులుకున్న స్టార్ హీరో.

Published on Jul 11, 2019 7:00 am IST

విలక్షణ నటుడు స్టార్ హీరో విక్రమ్ కి హాలీవుడ్ మూవీలో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించారట. ఐతే దానివెనుక గల కారణం తెలుపుతూ, “జాన్ విక్” మూవీ హీరో కీను రీవ్స్ నటిస్తున్న ఓ హాలీవుడ్ మూవీలో నాకు అవకాశం వచ్చినా, నాకు సరిపడే పాత్ర కాదని భావించి తిరస్కరించడం జరిగింది అన్నారు. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ “ది గ్రేట్ గట్స్ బై” మూవీలో ఆయన చేసిన పాత్రకూడా ఆయన ప్రతిభకు, ఆయన ఇమేజ్ కు సరిపోలేది కాదని చెప్పారు.

నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో మాట్లాడుతూ హాలీవుడ్ మూవీస్ కి భారత్ అనుకూల మార్కెట్ కావడంతో వారు భారత నటులకు అవకాశం ఇస్తున్నారటని,కానీ మనం పాత్రల ఎంపికలో జాగ్రత్తవహించాలని చెప్పారు. ఈయన తాజాగా నటించిన “మిస్టర్ కె కె” మూవీ ఈనెల 19న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More