‘విక్ర‌మ్‌’ ఫ‌స్ట్ లుక్‌.. సీరియస్‌ లుక్‌లో ముగ్గురు స్టార్లు.!

Published on Jul 11, 2021 1:26 am IST


ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, లోకేశ్ క‌న‌క‌రాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘విక్రమ్‌’. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర బృందం ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది.

అయితే తొలుత కేవలం కమల్‌హాసన్‌ లుక్‌ మాత్రమే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ముగ్గురు స్టార్ హీరోల ఇంటెన్స్ లుక్ లను ఒకే ఫ్రేమ్ లో చూపించి చిత్ర బృందం అందరికి ఒకింత సర్ప్రైజ్ అందించింది. ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు విజ‌య్ సేతుప‌తి మ‌రోవైపు ఫ‌హాద్ ఫాజిల్ ఉండ‌గా మధ్యలో క‌మ‌ల్ హాస‌న్ ఉన్నాడు. అయితే ముగ్గురు కూడా మధ్య వయస్కులుగా నెరిసిన గడ్డం.. గుబురు మీసాలతో సీరియస్ లుక్‌లో కనిపిస్తూ దర్శనమిచ్చారు. బ్లాక్ అండ్ వైట్ బ్యాగ్రౌండ్‌లో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :