విక్రమ్ సినిమా విడుదల తేది ఖరారు !
Published on Feb 18, 2018 11:10 am IST

విక్రమ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా ‘స్కెచ్’. అదే పేరుతో తెలుగులో ఈ నెల 23న విడుదల కానుంది. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇటీవల విక్రమ్ ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా విజయం పట్ల ధీమా వెక్తం చేసారు.

సురేష్ బాబు సమర్పణలో రానున్న ఈ సినిమాను మొదట జనవరి 26న విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు హిట్ అయ్యాయి. మాస్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ కంటెంట్ ఈ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

 
Like us on Facebook