సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో విక్రమ్ !

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో విక్రమ్ !

Published on Dec 10, 2018 5:59 PM IST


తమిళ స్టార్ హీరో విక్రమ్ ‘డిమాంటీ కాలనీ , ఇమ్మైక నొడిగళ్’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న డైరక్టర్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తన కొత్త చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జనవరి లో ఈ చిత్రంపై అధికారక ప్రకటన వెలుబడనుంది. ఇక గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కొనసాగుతున్న విక్రమ్ ఇటీవల సామి స్కొయెర్ తో ప్రేక్షకులముందుకు వచ్చి ఆ చిత్రం తో కూడా నిరాశపరిచాడు.

ఇక ఇప్పుడు ఆయన రాజేష్ సెల్వ దర్శకత్వంలో ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఆయన నటించనున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మహావీర్ కర్ణ’ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఈ చిత్రంలో విక్రమ్ టైటిల్ రోల్ లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు