విక్ర‌మ్ “మిస్ట‌ర్ కెకె ప్రీ రిలీజ్ ఈవెంట్…!

Published on Jul 14, 2019 10:00 pm IST

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిస్తున్న చిత్రం “మిస్ట‌ర్ కెకె” ఈనెల 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా నిర్మాతలు మిస్టర్ కె కె ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాతలు, జులై 16వ తేదీన హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నట్లు తెలిపారు.

ఈ చిత్రాన్ని తెలుగులో పారిజాతా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై టి.నరేష్ కుమార్,టి.శ్రీధర్ లు విడుదల చేస్తున్నారు. ఈ సంధర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవలే “కిల్లర్” మూవీని తెలుగులో విడుదల చేయగా ప్రేక్షకులు ఆదరించి విజయం అందించారు. ఇప్పుడు విక్రమ్ నటించిన “మిస్టర్ కె కె” చిత్రం విడుదల చేస్తున్నాము. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో విక్రమ్ లుక్, పెరఫార్మెన్స్ కి మంచి స్పందన వచ్చింది. మంచి నటులతో పాటు, నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నాం అన్నారు.

సంబంధిత సమాచారం :

More