విక్రమ్ కోబ్రా ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నారట..!

Published on Jan 19, 2020 3:11 pm IST

చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ కోబ్రా. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టుగా రెండు విష సర్పాలు, మధ్యలో ఓ బంగారు కిరీటంతో ఆ టైటిల్ డిజైన్ చాలా ఆసక్తిరేపేలా ఉంది. కాగా త్వరలో కోబ్రా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ లుక్ చాలా వైవిధ్యంగా ఉండనుందని కోలీవుడ్ వర్గాల భోగట్టా. అలాగే టైటిల్ డిజైన్ లోనే చాల క్లూస్ కూడా ఉన్నాయట.

విక్రమ్ 58వ చిత్రంగా తెరకెక్కుతున్న కోబ్రా లో ఆయన ఏకంగా 25 గెటప్స్ లో కనిపించనున్నారు. నిర్మాత లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా లెజెండరీ మ్యూజీషియన్ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అలాగే విక్రమ్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్ చిత్ర షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది.

సంబంధిత సమాచారం :

X
More