విక్రమ్‌కు షాకిచ్చిన మలేషియా ప్రభుత్వం

Published on Jul 22, 2019 9:16 am IST

చియాన్ విక్రమ్ నటించిన ‘కడరం కొండాన్’ చిత్రం తమిళంలో మంచి టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మిస్టేర్ కె.కె’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ విజయంతో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ లేని విక్రమ్ కొంచెం రిలీఫ్ అయ్యారు. కానీ ఇంతలోపే ఆయనకు మలేషియా ప్రభుత్వం నుండి షాక్ తగిలింది.

మలేషియాలో సైతం విక్రమ్ అభిమానులు ఉండటంతో అక్కడ కూడా చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమాలో కథ ప్రకారం మలేషియా పోలీసుల్ని, అక్కడి సమాజన్ని నెగెటివ్ కోణంలో చూపించడం జరిగింది. దీంతో అక్కడి సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్రాన్ని విడుదలచేయకూడని అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయించింది. దీంతో షాకైన చిత్ర టీమ్ మలేషియా సర్కారుకు క్షమాపణలు తెలిపింది.

సంబంధిత సమాచారం :