రామ్ చరణ్ సినిమాలోనూ అదే తమిళ్ విలన్.?

రామ్ చరణ్ సినిమాలోనూ అదే తమిళ్ విలన్.?

Published on Oct 11, 2015 6:44 PM IST

ram-charan-aravind
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా ఈ రోజుతో అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. అలాగే రేపు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇది చివరి దశలో ఉండగానే రామ్ చరణ్ తన తదుపరి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో విజయం సాధించిన ‘తని ఓరువన్’ రీమేక్ లో రామ్ చరణ్ నటించనున్నాడు. తమిళంలో స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి కనిపించాడు.

ఈ కథకి తగ్గట్టు తెలుగులో రామ్ చరణ్ కి పోటీని ఇచ్చే స్టైలిష్ విలన్ గా ఎవరు సరిపోతారా అని కొన్ని రోజుల నుంచి అన్వేషణ జరుగుతోంది. ఇప్పటికే నాగార్జున, మాధవన్ లాంటి పేర్లు చాలా వినిపించాయి. కానీ ఫైనల్ గా తమిళంలో విలన్ గా చేసిన అరవింద్ స్వామినే బెటర్ చాయిస్ అని ఈ చిత్ర టీం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర టీం అరవింద్ స్వామితో సంప్రదింపులు జరుపుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎన్.వి ప్రసాద్ – డివివి దానయ్య కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మరి అరవింద్ స్వామినే ఫైనల్ విలన్ గా సెలక్ట్ అవుతాడా లేక వేరే ఎవరికన్నా ఆ అవకాశం దక్కుతుందా.? అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు