చరణ్ సినిమా ఆడియో వేడుకలో ఎన్టీఆర్ మరియు కేటీఆర్ !

Published on Dec 13, 2018 2:46 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస డైరైక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ ని రేపటి నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పబ్ సెట్ లో షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో చరణ్ సరసన బాలీవుడ్ నటి ఇషా గుప్తా స్టెప్ లు వేయనుంది.

కాగా యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ నెల 24 లేదా 27వ తేదీల్లో ఏదొక తేదీన ‘వినయ విధేయ రామ’ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట. అయితే ఈ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి, ఎన్టీఆర్ తో పాటు ప్రత్యేక అతిధిగా కేటీఆర్ కూడా వస్తారని తెలుస్తోంది.

దానయ్యనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. అలాగే కేటీఆర్ కి, చరణ్ కి మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.

జనవరి 11వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే చాలావరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X