మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం సాంగ్స్ చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. కాగా ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.
ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు.


