వైరల్: సెట్‌లో చిల్ అవుతున్న తారక్, చరణ్, రాజమౌళి..!

Published on Aug 7, 2021 7:51 pm IST

రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఈ క్రేజీ మల్టీ స్టారర్‌పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రిలీజ్ డేట్ దగ్గరకొస్తుండడంతో ఈ మూవీ షూటింగ్ పనులు చకచక జరుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ “దోస్తీ” సెన్సేషన్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సెట్‌లో నుంచి వస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మొన్న ఐడీకార్డ్ మెడలో వేసుకుని కనిపించిన తారక్ ఫోటో సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అయ్యింది. అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” నుంచి వచ్చిన ఓ లేటెస్ట్ వీడియో కూడా క్రేజీగా వైరల్ అవుతుంది. తారక్, చరణ్, జక్కన్న షూటింగ్ మధ్యలో సరదాగా గడుపుతూ చిల్లింగ్ అవుతున్నట్టు వీడియోలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో కూడా అభిమానులకు చిల్ ఇచ్చే కిక్ ఇస్తుంది. మరీ ఈ ముగ్గురు చిల్ అవుతున్న వీడియో వైపు మీరు కూడా ఓ లుక్కేయండి.

సంబంధిత సమాచారం :