“వంటలక్క” నెట్‌ప్లిక్స్‌లో రాబోతుందా?

Published on Jul 6, 2021 2:50 am IST

సోమ-శనివారం మధ్య ప్రతి రోజు రాత్రి 7:30 గంటలకు ప్రతి ఇంట్లోని టీవీల్లో ఏముంటుందని ఏ ఒక్కరిని అడిగినా టక్కున చెప్పే సమాధానం స్టార్ మా ఛానల్‌లో వచ్చే ‘కార్తీక దీపం’ సీరియల్ అని. ఈ సీరియల్‌కు ఇంత క్రేజ్ రావడానికి వంటలక్కే ప్రధాన కారణం. అయితే ఇంతటి ప్రేక్షకుల ఆదారాభిమానాలను కొల్లగొట్టిన ఈ సీరియల్ గురుంచి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే కార్తీకదీపం సీరియల్ త్వరలోనే ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన ‘నెట్‌ఫ్లిక్స్‌లో’ రాబోతుందట. త్వరలోనే ఈ సీరియల్‌కు శుభం కార్డ్ పడబోతుందని, ఈ సీరియల్ ఒక సినిమాలా రాబోతుందని, అందుకే వంటలక్క కూడా ఓ మలయాళం సీరియల్‌కు సిద్ధం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది తెలీదు కానీ ఈ సీరియల్ కనుక సినిమా మాదిరి నెట్‌ఫ్లిక్స్‌లో వస్తే వంటలక్క అభిమానులు ఎగిరి గంతేస్తారనుకోండి.

సంబంధిత సమాచారం :