వైరల్..తన సాంగ్ కంప్లీట్ చేసేసిన పవన్..?

వైరల్..తన సాంగ్ కంప్లీట్ చేసేసిన పవన్..?

Published on Dec 4, 2021 9:06 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం హీరోగానే కాకుండా తానొక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని కూడా అందరికీ తెలిసిందే. అలాగే తెలుగు నేలకి చెందిన పలు జానపద గేయాలు కనుమరుగు అవుతున్న కలలని కూడా పవన్ ఎప్పటికప్పుడు తన సినిమాలు ద్వారా పరిచయం చేస్తూ ఉంటాడు.

ఇక ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా “బీమ్లా నాయక్” సినిమాలో కూడా ఒక అదిరే పాటని పాడాడని మొదటి నుంచి కూడా కన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ మాస్ సాంగ్ ని పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గానే రికార్డింగ్ కంప్లీట్ చేసేసుకున్నాడని బజ్ వైరల్ అవుతుంది. దీనికి నిదర్శనంగా ఒక లేటెస్ట్ ఫోటో కూడా వైరల్ అవుతుంది.

అయితే అందులో సెటప్ చూస్తుంటే ఏదో సాంగ్ పాడినట్టు గానే అనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు