వైరల్ పిక్ : ‘దేవర’ నుండి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్

janvi
టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ థ్రిల్లింగ్ మాస్ యాక్షన్ మూవీ దేవర. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం ఆవుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుండగా ప్రస్తుతం మొదటి భాగం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు.

మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ నుండి తంగం పాత్రలో కనిపించనున్న హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లంగా ఓణీ లుక్ లో జాన్వీ కపూర్ నాచురల్ గా అదరగొట్టిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దేవర మొదటి భాగం 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 4న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే.

Exit mobile version