ఇంటర్వ్యూ : విరాట్ – ‘పరిచయం’ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది !

Published on Jul 17, 2018 4:54 pm IST


విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘పరిచయం’. ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతున్న సంధర్బంగా చిత్ర హీరో విరాట్ మీడియా తో ముచ్చటించారు. ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం.

మీ గురించి చెప్పండి ?
మాది చిత్తూర్ కానీ నేను పెరిగింది అంత బెంగళూరులో నా కుటుంబానికి సినిమా పరిశ్రమ కి ఎలాంటి సంబంధం లేదు. నా డిగ్రీ పూర్తి అయ్యాక హైదరాబాద్ వచ్చి సినిమాల్లో అవకాశలకోసం తిరిగాను. దాదాపు 7సంవత్సరాల తరువాత ఈ అవకాశం వచ్చింది.

ఈ చిత్రం దేని గురించి ఉండనుంది ?
ఇది ఒక యువ జంట మధ్యలో నడిచే సున్నితమైన ప్రేమ కథ అలాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ సన్నివేశాలు కూడా బాగుంటాయి. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అక్కట్టుకుంటుంది.

ఈ చిత్ర హీరోయిన్ సిమ్రాత్ కౌర్ గురించి చెప్పండి ?
ఆమె చాలా నిజాయతీగా ఉంటూ కష్టపడి పనిచేసే అమ్మాయి. తెలుగు ఆమె మాతృ భాష కాకపోయినా సెట్స్ లోకి వచ్చి డైలాగ్ మాడ్యులేషన్ పైనే సాధన చేసేది. మొదట నాలాంటి కొత్త వారితో సినిమా చేయడానికి కొంచెం సంశయించారు. కానీ ఒకసారి స్క్రిప్ట్ విన్నాక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది . ఈ చిత్రంతో ఆమెకు కూడా మంచి పేరు వస్తుందనుకుంటున్న.

సీనియర్ నటులు పృథ్విరాజ్ , రాజీవ్ కనకాల తో కలిసి నటించడం ఎలా అనిపిస్తుంది ?
అది ఒక మంచి అనుభవం. నా మొదటి రోజు షూట్ లోనే నేను రాజీవ్ కనకాల గారి తో నటించాను ఆయన చాలా సరదాగా ఉంటారు. అలాగే పృథ్వి గారు నటన పరంగా చాలా సలహాలు ఇచ్చారు అవి నాకెంతో ఉపయోగపడ్డాయి .

మీ డైరెక్టర్ లక్ష్మికాంత్ గురించి ?
ఆయన ఒక మంచి దర్శకుడు. కామెడీ అయన ప్రధాన బలం ఈ చిత్రంలో మంచి హాస్యభరితమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ సినిమాకి ఎమోషనల్ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయి.

సంబంధిత సమాచారం :