ప్రజలందరికీ.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విజ్ఞప్తి !

Published on Mar 25, 2020 12:00 pm IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జాతీయ విస్తృత 21 రోజుల లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ ఇంట్లో ఉండమని క్రేజీ కపుల్ విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ కోరారు. వారు మాట్లాడుతూ.. “మన గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు ప్రకటించినట్లుగా, రాబోయే 21 రోజులు దయచేసి ప్రజలందరూ ఇంటి వద్దే ఉండండి. సామాజిక దూరం మాత్రమే కరోనాకు నివారణ అని తెలిపారు.

అలాగే “ప్రస్తుతం ఇది గడ్డు కాలం, ఈ పరిస్థితి యొక్క తీవ్రతను మనం అర్ధం చేసుకోవాలి. దయచేసి అందరూ కరోనా నివారణ చర్యలను అనుసరించి, ఐక్యంగా నిలబడండి. అందరికీ ఇది మా విజ్ఞప్తి” అని 51 సెకన్ల నిడివి గల వీడియోను ఈ క్రేజీ కపుల్ పోస్ట్ చేశారు.

కాగా భారతదేశంలో ఇప్పటివరకు 500కి పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

సంబంధిత సమాచారం :

X
More