రానా “విరాటపర్వం” కూడా ఓటీటీలోనే?

Published on Jul 14, 2021 12:11 am IST


దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన “విరాటపర్వం” ఓటీటీలో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే తొలుత ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్ ఓటీటీ నుండి భారీగా ఆఫర్స్ వస్తుండటంతో అటు వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం “నెట్‌ప్లిక్స్‌లో ఈ సినిమాను విడుదల కాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విక్టరీ వెంకటేశ్ “నారప్ప” అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న విడుదల కాబోతుండగా, ‘దృశ్యం 2’ కూడా డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :