ఆర్ ఆర్ ఆర్ పోస్టర్…దాదా కి సెహ్వాగ్ బర్త్ డే విషెస్..!

Published on Jul 8, 2021 1:46 pm IST

టీమ్ ఇండియా మాజి కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా డాషింగ్ ఓపెనర్, మాజి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇటీవల ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా ఓకే బైక్ పై కలిసి ఉన్న ఫోటో అది. అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన అనంతరం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ అదే పోస్టర్ ను మార్ఫింగ్ చేసిన దాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ సౌరవ్ గంగూలీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే వీరేంద్ర సెహ్వాగ్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :