ఇటీవల గజ తుపాను దాటికి తమిళనాడులో ని డెల్టా జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా అక్కడ సహయక చర్యలు కొనసాగుతూనే వున్నాయి. అయితే ఈ తూపాను అపారమైన నష్టం కలిగించడంతో ప్రభుత్వం తో పాటు తమిళ సినీ ఇండస్ట్రీ కి సంబందించిన బడా హీరోలు తమ వంతు గా విరాళాలను ప్రకటించారు.
ఇక తాజాగా యాక్షన్ హీరో విశాల్ ఒక అడుగు ముందుకేసి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తంజావూరు జిల్లాలోని కరగవయల్ అనే గ్రామం గజ తూపాను దాటికి పూర్తిగా దెబ్బతింది. ఈగ్రామాన్ని విశాల్ దత్తత తీసుకున్నాడు. ఇక అలాగే ఈ గ్రామాన్ని దేశంలోనే అత్యుత్తమ విలేజ్ గా తీర్చిదిద్దుతానని విశాల్ అన్నారు.


