విజయ్, కార్తీలు హిట్స్ కొట్టాలంటున్న యాక్షన్ హీరో

Published on Oct 25, 2019 11:00 am IST

విజయ్, కార్తీ నటించిన ‘బిగిల్’, ‘ఖైదీ’ చిత్రాలు నేడు విడువులైన సంగతి తెలిసిందే. కాగా ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాలని హీరో విశాల్ కాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ చిత్రాలకు బెస్ట్ విషెష్ చెప్పారు. నేటి ఉదయం ఆయన ట్విట్టర్ లో ఖైదీ, బిగిల్ మూవీస్ విజయం సాధించాలని కోరుకున్నారు. అట్లీ-విజయ్ ల కాంబినేషన్ లో మూడవ చిత్రంగా బిగిల్ వస్తుండగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక వైవిధ్య చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ కార్తీ హీరోగా చేసిన ప్రయోగాత్మక చిత్రం ఖైదీ. రెండు భిన్న జోనర్స్ లో వస్తున్న ఈ చిత్రాలపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి.

ఇక విశాల్ ప్రస్తుతం తమన్నా జంటగా సి సుందర్ దర్శకత్వంలో ‘యాక్షన్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో తమన్నా లేడీ ఏజెంట్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More