బాలనటిగా బాలీవుడ్ కి పరిచయమైన శ్వేతబసు ప్రసాద్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తను చేసిన ‘మకడీ’ సినిమాకి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత్ తెలుగులో ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇది కాకుండా ఆమె ఇటీవలే వ్యభిచార కేసులో పట్టుబడి వార్తల్లో నిలిచింది. ఈ విషయం అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు మీడియాలో సెన్సేషన్ అయ్యింది.
ఇదే విషయం గురించి విశాల్ భరద్వాజ్ ని అడిగితే ‘శ్వేత సంఘటన నన్ను కలచివేసింది. శ్వేత మంచి నటి. ఆమెకి జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది,అలాగే మీడియా ఆమెని దోషిగా చిత్రీకరించడం బాధాకర విషయం. ఆమె కోసం ఓ కథ రాస్తాను. ఏదిఏమైనా మళ్ళీ శ్వేతతో సినిమా చేస్తానని’ అన్నాడు.
విశాల్ భరద్వాజ్ దర్శకతవం వహించిన ‘హైదర్’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. షాహిద్ కపూర్ – శ్రద్ధ కపూర్ జంటగా నటించారు.


