ఇంటర్వ్యూ : విశాల్ – మరిన్ని తెలుగు సినిమాలు రీమేక్ చేయనున్నాను !

Published on Oct 27, 2018 3:07 pm IST

యాక్షన్ హీరో విశాల్ నటించిన ‘పందెంకోడి 2’ చిత్రం విజయవంతగా ప్రదర్శించబడుతున్న సందర్బంగా విశాల్ మీడియాతో మాట్లాడారు ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం …

మీరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న మేము సైతం ( తమిళ్) కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ?

చాలా బాగుంది. తమిళ నాడు లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ షో చూసి డొనేషన్స్ ఇస్తున్నారు. వాళ్ల రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది.

పందెంకోడి 2 కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ?

పందెంకోడి 2 ఓన్లీ సిటీ లోనే కాకుండా ఊర్లోనుండి కూడా కల్లెక్క్షన్స్ బాగున్నాయి. రూరల్ డ్రామా కాబట్టి వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతున్నారు. దసరా కు విడుదలైన ఈచిత్రం దీపావళి తరువాతి వారం రోజులు కూడా బాగానే ఆడుతుంది అనుకుంటున్నా.

ఈ మధ్య సీక్వెల్స్ మీద పడ్డట్లున్నారు ?

ఒక హిట్టయిన చిత్రానికి సీక్వెల్ తీయడమనేది చాలా కష్టం. కానీ నాకు కథ నచ్చి ఆసినిమాకు ఇది సీక్వెల్ అయితే బాగుంటుంది అనిపిస్తేనే ఓకే చేస్తున్న. ఆలా అభిమన్యుడు 2 అలాగే డిటెక్టివ్ 2, పందెంకోడి 3 చిత్రాలను ప్లాన్ చేస్తున్నాం.

టెంపర్ రీమేక్ గురించి ?

టెంపర్ ను ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నాం. ఈ సినిమా లో చాలా మార్పులు చేశాం. ఇప్పుడు జరుగుతున్న మీ టూ ఫై కూడా ఈ సినిమలో చూపించనున్నాం. నేను ఈసినిమా సంవ్సతరం క్రితమే చూసాను. కానీ ఇలాంటి టైంలో ఈ సినిమా వస్తే బాగుంటుందని ఈ చిత్రం ఒకే చేశాను.

ఈచిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారా ?

లేదండి . నాకు భయం తారక్ యాక్టింగ్ నా యాక్టింగ్ ను కంపేర్ చేస్తారని తారక్ లాగా నేను చేయలేను. అందుకే స్ట్రెయిట్ తమిళ సినిమా గానే తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలోని సోషల్ కాజ్ నాకు బాగా నచ్చింది.

వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారా ?

ఏమో తెలియదు. కానీ డబ్బులు తీసుకోకుండా ఓటు వెయ్యమని మాత్రం క్యాన్వాసింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. గత ఏడాది నామినేషన్ వేస్తే దాన్ని రద్దు చేశారు. దాని తరువాత ఉప ఎన్నికల్లో పోటీ చేయమని అడిగారు సరే అన్నాను అప్పుడు ఆ ఎలక్షన్స్ నే క్యాన్సల్ చేశారు. ఒకేవేళ ఈ సారి పోటీ చేస్తే ఏమవుతుందో చూడాలి.

వరలక్ష్మి శరత్కుమార్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా ?

అవ్వని రూమర్స్. నేను ప్రతి ఇంటర్వ్యూ లో చెబుతాను ఆమె, నేను చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్అంతే. ప్రస్తుతం ఒక బిల్డింగ్ నిర్మిస్తున్నాను. దాని మీదనే నా ఫోకస్ అదిమా ఇల్లు కాదది. పెళ్లి కూడా చేసుకుంటాను ఇంకా అమ్మాయి దొరకలేదు.

సంబంధిత సమాచారం :