విశాల్ పాన్ ఇండియా ఫిల్మ్ “లాఠీ” ఫస్ట్ లుక్ రిలీజ్

Published on Apr 6, 2022 5:11 pm IST

యాక్షన్ హీరో విశాల్ డైరక్టర్ ఎ. వినోద్ కుమార్ తో తెరకెక్కిస్తున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. లాఠీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విశాల్ పాన్ ఇండియా లోకి అడుగు పెడుతున్నాడు. ప్రస్తుతం, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణలో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ షెడ్యూల్ సుదీర్ఘంగా సాగుతోంది. మేకర్స్ ఈరోజు ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

నిర్మాణంలో ఉన్న భవనం ముందు దృఢంగా నిలబడి, విశాల్ చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీని మనం చూడవచ్చు. డ్యూటీలో ఉన్న విశాల్ శరీరమంతా గాయాలున్నాయి. భవనం నుండి లేజర్ కిరణాలు అతనిపై పడటాన్ని కూడా మనం గమనించవచ్చు. యాక్షన్ జానర్‌కి సంబంధించిన సినిమాకి సంబంధించిన పోస్టర్ ఇది. లాఠీ అనేది సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి ప్రభావితం చేసే శక్తివంతమైన వస్తువు. ఈ చిత్రానికి అన్ని భాషల్లో ఒకే టైటిల్‌ పెట్టారు. ఇది కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ దర్శకుడు ఎ. వినోద్‌ కుమార్‌ ఒక నవల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో విశాల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నాడు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన సునైనా కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్స్ రచయిత పొన్ పార్థిబన్, సంగీతం సామ్ సిఎస్ DOP బాలసుబ్రమణియన్, స్టంట్ డైరెక్టర్లు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్, PRO వంశీ, శేఖర్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :