
దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ప్రణిత ఈ సినిమాలో హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. హీరో హీరోయిన్లు పాల్గొనగా విజయ్ మాస్టర్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఎక్కువ మంది జనం గుమిగూడిన గల్లిలో కాయగూరల మార్కెట్, తోపుడు బళ్ళు మధ్య ఈ సన్నివేశాలు తెరకెక్కించారు.
తమిళ సినిమా ‘అరిమ నంబి’కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు, తన ఎడమ చేతిపై ఓ భారి టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్నారు. క్యారెక్టర్లో ఇంటెన్సిటీని ఆ టాటూ బాగా ఎలివేట్ చేస్తుందని దర్శకుడు కన్వీన్స్ చేయడంతో విష్ణు ఓకే చెప్పారు. ఈ సినిమాపై మంచు విష్ణు నమ్మకంగా ఉన్నారు.