మరోసారి భక్తిభావాన్ని పెంచేందుకు వస్తున్న ‘కన్నప్ప’.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..?

మరోసారి భక్తిభావాన్ని పెంచేందుకు వస్తున్న ‘కన్నప్ప’.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..?

Published on Jun 18, 2026 1:58 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన డివోషనల్ చిత్రం ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ భక్తిరస చిత్రంలో విష్ణు మంచు భక్త కన్నప్ప పాత్రలో నటించి మెప్పించాడు. భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు.

అయితే, ఇప్పుడు మరోసారి థియేటర్లలో అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. ఈ ఎపిక్ సినిమాటిక్ వండర్‌ను జూన్ 27న రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పరమశివుని భక్తుడి కథను బిగ్ స్క్రీన్‌పై మరోసారి వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధం కావాలంటూ అఫీషియల్‌గా వెల్లడించారు.

ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణం నటించారు. స్టీఫెన్ దేవస్సి సంగీతం అందించిన ఈ విజువల్ వండర్‌ను మోహన్ బాబు ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు