“పాగల్” ట్రైలర్..ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న విశ్వక్ రోల్.!

Published on Aug 10, 2021 11:22 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చిత్రం “పాగల్” కూడా ఒకటి. మరి ఇప్పటికే యూత్ లో మంచి బజ్ ను ఏర్పర్చుకున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల వచ్చిన టైటిల్ సాంగ్ తో కూడా మంచి ఆదరణను దక్కించుకుంది. మరి ఇప్పుడు మేకర్స్ నుంచి ఈ చిత్రం తాలూకా ట్రైలర్ బయటకి వచ్చింది. ఇది ఒకింత ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాలి.

ముఖ్యంగా అయితే విశ్వక్ రోల్ చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. అంతే కాకుండా గత సినిమాలతో పోలిస్తే విశ్వక్ సూపర్ స్టైలిష్ గానే కాకుండా మరింత చార్మ్ గా కూడా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా ఏ అమ్మాయికి పడితే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ సిల్లీ లవర్ బాయ్ లా మంచి ఫన్ ని కూడా పుట్టించాడు. మరి మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా నివేతా పెత్తురాజ్ రోల్ తో మంచి ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి.

అలాగే తన హీరోయిన్ ఈనగరానికి ఏమైంది ఫేమ్ సిమ్రాన్ చౌదరి కూడా కనిపిస్తుంది. అలాగే నరేష్ కుప్పిలి డైరెక్షన్ ఈ ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు కూడా పెంచింది అని చెప్పొచు. మరి ఈ “పాగల్” ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తాడో తెలియాలి అంటే వచ్చే ఆగష్టు 14 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందివ్వగా దిల్ రాజు నిర్మాణం అందించిన సంగతి తెలిసిందే.

 

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :