పాగల్ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ట్రైలర్ విడుదల అయిన ఒక్క రోజు లోనే ఈ 2.8 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, 167కే లైక్స్ ను సాధించింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం మాత్రమే కాకుండా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లా అనిపిస్తూ ఉండటం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
దిల్ రాజు సమర్పణ లో బెక్కెం వేణు గోపాల్ లక్కీ మీడియా పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నరేష్ కుప్పిలి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రధన్ అందిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్ ఈ చిత్రం తో క్రేజ్ పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంటున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 14 వ తేదీన థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
ట్రైలర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


